స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం సాధారణమైపోయింది. తాజాగా సముద్రం నుంచి తీరానికి వచ్చిన ఓ చిన్న టైగర్ షార్క్ చేప తోక భాగాన్ని పట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఉత్తర కరోలినాలోని వ్రైట్స్‌విల్లే బీచ్‌లో ఓ వ్యక్తి షార్క్ చేప తోకపట్టుకుని దుస్సాహసం చేశాడు. కానీ అతడికి ఆ చేప చుక్కలు చూపించింది. తోక పట్టుకోవడంతో అతడి చేతిని షార్క్ కొరికి పెట్టింది.
దీంతో గాయానికి గురైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు బాధితుడు నడుము లోతు ఉన్న నీటిలోకి దిగాడని, అంతలో అక్కడకు వచ్చిన షార్క్ తోక పట్టుకున్నాడని.. అందుకే అతని చేతికి గాయమైందని అధికారులు చెప్తున్నారు. షార్క్ తన చేతిని కొరికేయడంతో అతడి చేతి నుంచి రక్తం కారడంతో.. తీరానికి పరుగులు తీసి.. ఆస్పత్రిలో చేరాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.