అమెరికా భయం భయం... భారత్-పాక్ మధ్య అణుయుద్ధం వస్తుందేమో?

శుక్రవారం, 10 మార్చి 2017 (20:34 IST)
ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ వుంటుంది. ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుని పరిస్థితులు తెలుసుకుంటూ వుంటుంది. ముఖ్యంగా భారతదేశం వైఖరి ఎలా వుందన్నది ఆ దేశానికి చాలా ముఖ్యమని వేరే చెప్పక్కర్లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి సహనం చాలా ఎక్కువ. అలాంటి దేశానికి కోపమొస్తే... బాబోయ్ చాలా ప్రమాదమని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ జోసఫ్ వోటెల్ అభిప్రాయపడ్డారు. 
 
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం అణుదాడులకు దారితీసే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశాల స్థితిగతుల గురించి అమెరికా సెనేట్ ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీకి ఆయన ఓ నివేదిక ఇచ్చారు. ఇందులో భారత్-పాకిస్థాన్‌ దేశాల మధ్య పరిస్థితులు ఎలా వున్నాయో, ఎలాంటి ఉపద్రవం రావచ్చో కూలంకషంగా వివరించారు. 
 
పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులు దాడులకు తెగబడటాన్ని భారతదేశం ఎంతోకాలంగా ఓర్చుకుంటోందనీ, ఆ ఓర్పు హద్దులు దాటితే మాత్రం భారతదేశం ఇక ఎంతమాత్రం ఉపేక్షించదనీ, పాకిస్తాన్ దేశంపైన చర్యలు తీసుకునే అవకాశం వుందనీ, ఇది అణుయుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి