కొండ చిలువ ముళ్ల పందిని మింగేసింది.. చర్మంపై ముళ్లు.. అయ్యోపాపం.. అన్నారు.. (వీడియో)

శనివారం, 1 ఏప్రియల్ 2017 (14:29 IST)
కొండ చిలువ అయినప్పటికీ.. ముళ్లపందిని తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోలేకపోయింది. అంతే ముళ్ళపందిని ఆహారమే కదా అని మిగేసింది. ఇక నానా తంటాలు పడింది. నరకయాతన అనుభవించింది. ఇక ముళ్లపంది మింగేయడంతో కొండ చిలువ శరీరం మొత్తం ముళ్లన్నీ బయటికి కనిపించాయి. 

ముళ్లన్నీ దాని శరీరం నుంచి బయటికి చొచ్చుకుని రావడంతో కదల్లేక బాధపడుతున్న ఆ పామును కుక్క కూడా తరుముకోవడంతో.. ఇంకా ఆ పాము నరకయాతన ఎక్కువైంది. బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. 
 
ఈ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు రెండు నిమిషాల పాటు నిడివి గల ఈ వీడియోను చూసినవారంతా అయ్యోపాపం అంటున్నారు. కొండచిలువ బాధకు విలవిల్లాడిపోయివుంటుంది కదా అంటూ జాలిపడ్డారు. ఇంకా కొందరైతే కొండచిలువకు అది చెడురోజుగా పేర్కొన్నారు. కాగా కొండచిలువ తీసుకునే ఆహారం దాదాపు నాలుగు లేదా ఆరు రోజుల్లోపు జీర్ణమవుతుంది. మరి ఆ కొండ చిలువ పరిస్థితి ఏంటో?

 

వెబ్దునియా పై చదవండి