నా బిడ్డను డైల్ చంపేశాడు.. మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. రూ.3కోట్ల భారీ జరిమానా

శనివారం, 1 ఏప్రియల్ 2017 (15:44 IST)
సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా ఆరోపించడం ద్వారా భారీ జరిమానాకు గురైంది. వివరాల్లోకి వెళితే.. యాష్ విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మండ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని తాను చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. 
 
తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకును హతమార్చాడని ఆరోపించింది. అయితే డైల్ హమ్మండ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. జాక్వెలిన్ హమ్మండ్‌పై అతడు పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును విచారిస్తున్న కోర్టు తాజాగా హమ్మండ్‌ను దోషిగా ప్రకటించింది. ఇంకా కోర్టు సదరు మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినా కోర్టు తీర్పు ఇచ్చింది. 
 
హమ్మడ్ బిడ్డను తాను చంపేసానని విమర్శించడంతో ఎంతో ఆవేదనకు గురైయ్యానని.. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠంగా నిలుస్తుందని డైల్ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి