దక్షిణ కొరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసింది. ఏళ్ల తరబడి ఫ్రిజ్‌లో భద్రపరిచింది. దీంతో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2018లో సువాన్ నగరానికి చెందిన ఓ మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాపను కూడా కర్కశంగా చంపేసింది.