పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంక దేశంలో చమురు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో పెట్రోల్, డీజల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. ఫలితంగా ఈ చమురు కోసం ప్రజల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుుకుంటున్నాయి. శ్రీలంకలో 1948 తర్వాత ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, శ్రీలంకలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర రూ.450గా ఉంటే, డీజిల్ ధర రూ.445గా పలుకుతోంది. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదు. చమురు నిల్వలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేయడంపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.