సూడాన్‌లో కూలిన బంగారు గని - 38 మంది మృతి

బుధవారం, 29 డిశెంబరు 2021 (08:27 IST)
సూడాన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం సూడాన్ దేశ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
నిజానికి ఈ గనిని సూడాన్ ప్రభుత్వం కొంత కాలం క్రితమే మూసివేసింది. కానీ, ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బంగారం కోసం ఈ గనిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఈ గని కూలిపోవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దేశంలో తరచుగా బంగారు గనుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు అలాంటి ప్రమాదం మరొకటి సంభవించింది. అయితే, గనుల భద్రత కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలను లేకపోలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు