ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, దర్శకుడు కొత్తపల్లి నగేష్ ఇదివరకే చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మా తొలి నిర్మాణంలో సుగ్రీవ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర కథ చాలా బాగుంటుంది. అందరూ మెచ్చే కథతో వస్తున్నాం.. ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
హీరోయిన్ కృష్ణ ప్రియ, మరో హీరో అనిల్‌తో పాటు రవి, ఉమంత కల్ప, కృష్ణ, లెనిన్ సింహ, కృష్ణ కాంత్, చిట్టి, శేకింగ్ శేషు, ప్రముఖ నిర్మాత రవి పైడిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వంశీ, అనిల్, కృష్ణ ప్రియ, తనికెళ్ల భరణి, ఆనంద్ చక్రపాణి, ఆర్‌ఎక్స్ 100 కరణ్, పార్వతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః రవి. వి, కొరియోగ్రఫీ: జిత్తు, సాహిత్యంః కృష్ణకాంత్, నిర్మాతలు: మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కొత్తపల్లి నగేష్.