ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఓ షియా మసీదు వెలుపల ఉగ్రవాది తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బాంబు పేలుడుతో మసీదు పరిసర ప్రాంతం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో పరుగులు తీశారు.