క్రూ-10 మిషన్‌లో నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత, విలియమ్స్, విల్మోర్, నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడిన క్రూ-9 మిషన్ భూమికి తిరిగి వస్తుంది.