ఆరు వారాల గర్భం తర్వాత అబార్షన్ నిషేధం.. అమెరికా సుప్రీం నో
గురువారం, 2 సెప్టెంబరు 2021 (21:24 IST)
ఆరు వారాల గర్భం తర్వాత అబార్షన్‌ను నిషేధించే టెక్సాస్ చట్టాన్ని నిరోధించాలని దాఖలైన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్ట అమలును నిరోధించేందుకు అత్యవసర విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌దార్లు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించేందుకు 5-4 తేడాతో న్యాయమూర్తులు ఓటు వేశారు.
బుధవారం నుండి అమల్లోకి రానున్న ఈ చట్టంతో... టెక్సాస్‌లో అబార్షన్‌పై మొత్తంగా నిషేధం విధించినట్లే అవుతుంది. మేలో రిపబ్లికన్ గవర్నర్ గ్రేగ్ అబోట్ ఈ చట్టంపై సంతకం చేశారు.
కాగా, 1973లో దేశ వ్యాప్తంగా అబార్షన్ చట్టబద్దం చేసిన సుప్రీం తీర్పు ఓ మైలురాయిగా నిలిచినప్పటి నుండి ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి నిషేధం అనుమతించలేదని... అబార్షన్ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
అయితే టెక్సాస్ చట్టం రాజ్యాంగ బద్ధతపై తమ తీర్పు ఎలాంటి నిర్ధారణకు రాలేదని, న్యాయవ్యవస్థ ముందుకు సాగేందుకు చట్టానికి అనుమతించినట్లయిందని కోర్టు పేర్కొంది.