సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భర్త హింసిస్తున్నాడని.. మనస్పర్ధలు ఉన్నాయని సంసారానికి పనికిరాడని విడాకులు తీసుకునే మహిళలు చాలామంది. కానీ భర్త తన పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదని ఓ భార్య విడాకులు తీసుకున్న ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. తైవాన్‌కి చెందిన లిన్ అనే మహిళ తన భర్త తాను చేసిన మెసెజ్‌లకు రిప్లై ఇవ్వట్లేదని, తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ మహిళ తన భర్తకు దూరమైంది.
లిన్ గత ఆరు నెలల పాటు తన భర్తకు లైన్ అనే మెసెజింగ్ యాప్ ద్వారా మెసేజ్‌లు పంపింది. అయితే వాటిని చూసినప్పటికీ ఆమె భర్త బదులు ఇవ్వలేదు. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్నా కొన్నాళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అంతెందుకు ఒకసారి లిన్ కారు ప్రమాదానికి గురైన సమయంలో మెసేజ్ పెట్టినా.. చూసి కూడా రిప్లై ఇవ్వలేదట. ఇలా తన పట్ల భర్త నిర్లక్ష్యంగా వుండటం ద్వారా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది.