తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని వశం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి చాలామంది సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ వెళ్లిపోతూనే వున్నారు. అందుకు అమెరికా సాయం చేస్తుందన్నది తాలిబాన్ల అనుమానం. దాంతో తమ దేశ ఉన్నత వర్గాలను దయచేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లవద్దని తాలిబన్లు అమెరికాను బ్రతిమాలుడుతున్నారు.
ఎందుకంటే సంపన్నులు అంతా వెళ్లిపోతే ఇక మిగిలేది డొల్లే కదా. అసలే ఆర్థిక కష్టాలతో అగమ్యగోచరంగా మారిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సంపన్నులు కూడా దేశం వదలి వెళ్లిపోతే... యువతుకు ఉపాధి, పరిశ్రమలు అంతా క్లిష్టమైపోతుంది. దాంతో మళ్లీ తాలిబాన్లపై ప్రజలు తిరగబడే అవకాశం లేకపోలేదు.