Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

చిత్రాసేన్

సోమవారం, 13 అక్టోబరు 2025 (08:25 IST)
Shankara Varaprasad, Nayanthara
మెగాస్టార్ చిరంజీవి, నయన తార కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఆల్రెడీ ఉండగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

ఈరోజు ఈ సినిమాలో మీసాల పిల్ల.. అనే సాంగ్ విడుదలకాబోతుంది. లోగడ చిరంజీవి రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం చైర్ లోకూర్చుని హీరోయిన్ చూస్తూ వున్న సన్నివేశాలన్ని తలపించేలా దర్శకుడు ఈ సారి సరికొత్తగా తీస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇంకోవైపు ఈ సినిమాకు డిమాండ్ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు, థియేట్రికల్ హక్కులే 100 కోట్లకి పైగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవిని చూసినట్లుగా కథ, కథనాలు వుంటాయని దర్శకుడు ఇప్పటికే మార్కెట్ స్ట్రాటజీ చూపాడు. చిరంజీవిని మంచి ఎంటర్టైనర్ లో చూసి కూడా చాలా కాలం అయ్యింది.  కనుక ఈ రేటుకు చిరంజీవి మార్కెట్ మరోసారి పెరుగుతుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు