అమెరికా టెక్సాస్ రాష్ట్రం శాన్ అంటోనియోకు చెందిన జనెత్ ట్రెవీనో అనే 37 మహిళ... తన మాటల తీరుతో కౌగిలింతలను పూర్తి వ్యాపారంగా మార్చేసింది. ఇందుకు ఆమె భర్త జెనెత్ భర్త కార్లోస్ కూడా పూర్తిగా సహకరించడం గమనార్హం. 40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు 10,9000) సంపాదిస్తోంది.
దీనిపై ఆమె స్పందిస్తూ "ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను. మొదట్లో పార్ట్ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో దానిని ఫుల్ టైంగా మార్చుకున్నాను. ఇందుకోసం కడ్డలిస్ట్.కామ్ అనే వెబ్ సైట్ ద్వారా కౌగిలింతలపై ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నాను" అని జెనెత్ తెలిపింది. అయితే, సెక్స్‌కు తావు లేకుండా అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు.