గుడ్డు ధర రూ.30... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

గురువారం, 24 డిశెంబరు 2020 (10:30 IST)
అధిక పోషకాలు, తక్కువ ధరలో లభించి ఆహరం గుడ్డు మాత్రమే. అయితే ఒక గుడ్డు ధర ఇప్పుడు రూ.30 పలుకుతోంది. డజను గుడ్ల ధర రూ.350కి పైమాటే. ఇది విని వామ్మో అంత ధరా? అని షాక్‌ అవ్వకండి.

ఈ ధరలు మనదేశంలో కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో. ఇటీవల పాకిస్తాన్‌లో నిత్యవసర ఆహార పదార్ధాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్డు ధర రూ.30 పలుకుతుంటే, పంచదార ధర రూ.100కి పైగా ఉంది. ఇక కిలో అల్లం ధర రూ.1000కి పైగా పలుకుతోంది.

ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌, ఆ ధరలను అదుపు చేయలేకపోతున్నారు. కరోనా కారణంగా దేశం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. ఆదాయం పెంచుకునేందుకు పన్నులు పెంచగా ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో విత్‌ డ్రాలు పెరగడంతో దేశంలో పెద్ద సంఖ్యలో నోట్ల ముద్రణ జరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు