తాలిబన్లు సైనికులు కాదు...సామాన్య పౌరులు : ఇమ్రాన్‌ ఖాన్‌

గురువారం, 29 జులై 2021 (11:02 IST)
తాలిబన్లు సైనిక సంస్థలు కాదని, సామాన్య పౌరులేనని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. పాక్‌ సరిహద్దుల్లో 30 లక్షల మందికి పైగా ఆప్గాన్‌ శరణార్ధులు ఉన్నారని....వారిని ఎలా తుదముట్టించాలని కోరుతానని ప్రశ్నించారు.

వీరిలో ఎక్కువగా పష్టున్లు (తాలిబన్‌కు చెందిన ఓ జాతి) చెప్పారు. ఇప్పుడు అక్కడ 5 లక్షల మందితో కూడిన శిబిరాలు ఉన్నాయని, తాలిబన్లు సైనిక సంస్థలు కాదని, వారు సాధారణ పౌరులేనని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో కొంత మంది పౌరులు ఉంటే...పాకిస్తాన్‌ వారిని ఎలా తుదిముట్టిస్తుందని, వాటిని అభయారణ్యాలుగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.

ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో తాలిబన్లకు సైనిక, ఆర్థికపరమైన సాయాన్ని పాక్‌ అందిస్తోందన్న వార్తలను ఆయన ఖండించారు. ఆప్గనిస్తాన్‌లో అమెరికాతో యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 2001, సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లో జరిగిన దానికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు