2011 నుండి 2021 మార్చి 1 వరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్) నుండి 81,700 మంది, అసోం రైఫిల్ నుండి 15,904 మంది స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామాలు చేశారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
రాజీనామాలు, విఆర్‌ఎస్ తీసుకుంటున్న విధానం ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుందని పేర్కొంది. అయితే ఉద్యోగాలకు స్వస్థి పలికేందుకు గల కారణాలను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రత్యేక అధ్యయనం ఏమీ చేయలేదని కేంద్రం తెలిపింది