వివరాల్లోకి వెళితే.. అట్లాంటిక్ సముద్రంలోని టోరీ దీవుల సమీపంలో 'డగ్గీ' అనే డాల్ఫిన్‌తో పాటు మరో డాల్ఫిన్ ఉండేది. ఇద్దరు మంచి స్నేహితులు. అయితే.. అనుకోని ప్రమాదంలో డగ్గీ (డాల్ఫిన్) స్నేహితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్నేహితుడి మరణంతో ఒంటరిదైన డగ్గీకి.. అనుకోకుండా సముద్ర తీరంలో బెన్ (శునకం) పరిచయమైంది.