ఆవు పేడ నుంచి రాకెట్ ఇంజిన్‌-జపాన్‌ శాస్త్రవేత్తలు

శనివారం, 16 డిశెంబరు 2023 (15:31 IST)
జపాన్‌ సైంటిస్టులు ఆవు పేడ నుంచి రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని జపాన్‌ స్పేస్‌ స్టార్టప్‌ ఇంటర్‌ స్టెల్లార్‌ టెక్నాలజీస్ ప్రకటించింది. 
 
ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్‌తో రాకెట్ ఇంజిన్‌ను జపాన్ శాస్త్రవేత్తలు నడిపారు. సాంప్రదాయ రాకెట్‌ ఇంజిన్ల తో పోల్చితే లిక్విడ్‌ బయోమీథేన్‌ ఆధారిత రాకెట్‌ ఇంజిన్ల ఖర్చు చాలా తక్కువని ఐఎస్‌టీ తెలిపింది. 
 
జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్‌లోని హక్కైడో స్పేస్‌పోర్ట్‌లో 10-సెకన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్”లో కిక్‌స్టార్ట్ చేశారు. లిక్విడ్ బయోమీథేన్ లేదా ఎల్బీఎం ద్వారా శక్తిని పొందుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు