కాశ్మీర్ సమస్య విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగానే ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. కాశ్మీర్ అంశంపై అవసరమైన సాయం చేయగలుగుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా విషమంగా ఉందని, త్వరలో బాగుపడుతుందని భావిస్తున్నానన్నారు.
ఇరు దేశాల ప్రధానులు తనకు మంచి స్నేహితులని చెప్పుకొచ్చారు. రెండు దేశాలు అణుబాంబులున్న దేశాలని, వారే సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక అంశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.