చరిత్రలో ఈరోజు

మంగళవారం, 20 జులై 2021 (20:44 IST)
జూలై 20న  సంఘటనలు:
 
1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
 
1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.
 
1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది.
 
1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
 
1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
 
1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
 
1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు.
 
1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ.
 
1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
 
1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం)
 
1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
 
1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది.
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు