తెలుగు కవిత్వంలో ఈ శతాబ్దం నాది అని ధైర్యంగా చెప్పిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవి. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు బాసటగా అణగారిన, అన్నార్తుల, బాధిత, పీడిత, తాడిత వర్గాలకు అండగా ఉన్నా, నేనున్నా, వస్తున్నానని అభయ మిచ్చి గొప్పోడి దోపిడీని, పెట్టుబడిదారీ నిరంకుశత్వ పోకడలను ఖండించేందుకు ఖడ్గ సృష్టి చేసి సమాజానికి అందించాడు.