చైనా ప్రధాన రహదారిలో బొమ్మ కారుతో చిన్నారి ప్రయాణం.. షాకింగ్ వీడియో మీకోసం..

గురువారం, 3 నవంబరు 2016 (15:24 IST)
షాకిచ్చే సంఘటనలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా రోడ్డులో అనేక వాహనాలు వస్తూ వెళ్తూ ఉండగా.. ఓ చిన్నారి తన బొమ్మ కారులో ప్రధాన రహదారిలో ఎలాంటి భయం లేకుండా కార్ల మధ్యలో నడుపుకుంటూ వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. చైనాలోని ఓ ప్రధాన రహదారిలో పలు కార్లు, వ్యాన్లు, బస్సులు, మోటారు బైకులు అతి వేగంగా వస్తుంటాయ్.. వెళ్తుంటాయ్. 
 
అయితే ఈ పెద్ద పెద్ద వాహనాల మధ్య ఓ చిన్నారి తన బొమ్మకారుతో రోడ్డుపై బండి నడపడం అందరికీ షాక్ నిచ్చింది. ప్రధాన రహదారిలో ఇలా చిన్నారి బొమ్మకారును నడుపుకుంటూ వెళ్ళడం చూసిన వాహన దారులు అప్రమత్తమయ్యారు. కార్లను నిలిపి తమ దారిని మళ్ళించుకున్నారు. అయితే చిన్నారి మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రధాన రహదారిలో తన బొమ్మకారుతో ప్రయాణం చేసింది. దీన్ని గమనించిన పోలీసులు ఆ బిడ్డను, బొమ్మకారును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డైంది.


 

వెబ్దునియా పై చదవండి