అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాయి. ప్రస్తుతం చైనా, రష్యా బాటలో భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించింది.
అయితే సుంకాల పెంపు అమలు తేదీలో భారత్ మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల్లో బాదం, వాల్ నట్స్, ఆపిల్స్ తదితర ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి.