వంటింట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండచిలువ.. టీ కాచుకుందామని కిచెన్‌లోకి వస్తే?

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (11:10 IST)
పొలాల్లో పాము కనిపిస్తేనే జడుసుకుంటాం. అలాంటిది వంటింట్లో కొండచిలువ కనిపిస్తే.. వామ్మో ఇంకేమైనా వుందా? ప్రాణాన్ని చేతిలో పెట్టుకుని పరుగులు తీసేస్తాం. అలాంటి ఘటనే ఢిల్లీ, గుర్గావ్‌లోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది. ఓ ఇంటి వంటింట్లో కొండచిలువ ప్రత్యక్షమైంది.
 
వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోని షీట్ల కాలనీలో సుమన్ గౌతమ్ అనే మహిళ ఇంట్లో టీ కాచుకునేందుకు వంటింట్లోకి వెళ్లింది. గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా వచ్చిన శబ్ధంతో భయబ్రాంతులకు గురయ్యింది. వంటింట్లోని పాత్రల కింద ఉన్న ఐదడుగుల కొండచిలువను చూసేసరికి సుమన్‌కు నోటమాటరాలేదు.

వెంటనే ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దాన్ని చూసేందుకు ఇరుగుపొరుగు వారు వచ్చారు. కొండచిలువ వచ్చిన విషయాన్ని భర్త సుమన్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. 
 
వణ్యప్రాణి సంరక్షణ బృందం అక్కడికి చేరుకొని ఇంట్లో ఉన్న పామును పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు కొండచిలువను పట్టుకుని మానేసర్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గుర్గావ్‌లో ఇలా కొండచిలువల్ని పట్టుకోవడం ఇది 15వ సారి కాగా.. ఇంట్లోకి ఇలా కొండచిలువ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇది తొలిసారి అని అధికారులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు