అమెరికాలో అద్భుతం జరిగింది. వైద్యులు శభాష్ అనిపించారు. సౌత్ క్యాలిఫోర్నియాలో ఓ పేషెంట్‌కు గుండెను మార్చాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తేనే బాధితుడు బ్రతుకుతాడు. దీంతో బాధితుడి కుటుంబం హార్ట్ డోనర్ సాయంతో గుండెను బాక్స్‌లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన బాక్స్‌ను శాన్ డియాగో నుండి ఎనిమిది సీటర్ల ప్రైవేట్ హెలికాప్టర్‌లో సుమారు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న సౌత్ క్యాలిఫోర్నియాలోని కెక్ హాస్పటల్ యూనివర్సిటీకి తరలించారు.