అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చొన్నది మొదలుకుని, ఓ వ్యూహం ప్రకారం భారతీయ ఉద్యోగుల్ని, నిపుణులను ఆయన లక్ష్యంగా చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు కొరఢా ఝళిపించటానికి సిద్ధమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి హెచ్1బీ వీసాపై నివాసముంటున్న వారిని వెనక్కి తిప్పి పంపటానికి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ప్రతి ఏడాది 85 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తారు. వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతాయి. వీరిలో ఎక్కువ మంది కంప్యూటర్ సిస్టమ్స్ ఎనలిస్ట్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్స్‌గా పనిచేసేవారే ఎక్కువ. కానీ గత రెండేళ్ళుగా కంపెనీల వీసాల వినియోగం సగానికి సగం - అంటే పదివేల కంటే దిగువకు పడిపోయింది.