కరుడుగట్టిన ఉగ్రవాది, జామాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన హఫీద్ సయీజ్ అంటే తనకు ఎంతో ప్రేమ, ఇష్టమని పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ వేర్పాటువాదులకు సయీద్ ఎంతో సహకారం అందిస్తున్నాడని కూడా ముషారఫ్ వ్యాఖ్యానించారు.
హఫీజ్ సయీద్, మాజీ సైనిక నియంత ముషారఫ్‌లు కలసి ఎన్నికలకు వెళితే ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవని స్టాట్ హెచ్చరించారు. హఫీజ్‌కు ముషారఫ్ బహిరంగంగా మద్దతు పలకడం ద్వారా విపరీత పరిస్థితులు తప్పవన్నారు. వీరిద్దరి కలయిక ప్రపంచానికే ప్రమాదకరమని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో అమెరికా పూర్తిస్థాయిలో బంధాలను తెంచుకోవడం మంచిదని సూచించారు.