ఆ ఘటనల కంటే కరోనా డేంజర్.. ఇన్ఫెక్షన్ల రేటు అప్

గురువారం, 7 మే 2020 (13:27 IST)
9/11 దాడి, రెండవ ప్రపంచ యుద్ధం ఘటనల కన్నా కరోనా మహమ్మారి అమెరికాను తీవ్రంగా దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు. వైట్‌ హౌస్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఇది పెర్ల్‌ హార్బర్‌ కన్నా, ప్రపంచ వాణిజ్య కేంద్రాలైనా ట్విన్‌ టవర్స్‌పై దాడి కన్నా ఘోరంగా ఉందని, ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదన్నారు. 
 
మరోవైపు అమెరికాలో లాక్ డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఒక్కరోజులో సుమారు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా, వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. 
 
లాక్ డౌన్‌ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణమని, ఇన్ఫెక్షన్‌ రేటును అదుపు చేయకుంటే ఎంతోమంది మరణించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందవచ్చని అంచనా వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు