ఒకే ఇంట్లో యువతీ - యువకుడు : ఇద్దరికీ కరోనా పాజిటివ్.. ఎలా?

గురువారం, 7 మే 2020 (11:51 IST)
హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో కలిసివుంటున్న ఓ యువతీ, యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వీరిలో యువకుడు ఐఏఎస్ శిక్షణ, యువతి టీచర్ ట్రైనింగ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. వీరిద్దరికీ కరోనా వైరస్ సోకడంతో స్థానికంగా కలకలం రేగింది. పైగా, వారు నవసిస్తున్న ఇంటి యజమానితో పాటు, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు అధికారులు ఆదేశించారు. 
 
హైదరాబాబాద్ నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గాంధీ ఠాణా పరిధిలో ఒకే ఇంట్లో ఓ యువతి, ఓ యువకుడు నివసిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడటం వల్ల వీరిద్దరూ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వీరికి వైరస్​ ఎలా సోకి ఉంటుందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 
 
నాలుగు రోజుల క్రితం యువకుడికి దగ్గు, జలుబు రావడం వల్ల గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అతడి నమూనాలు పరీక్షించగా, శనివారం పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది. అదేరోజు యువతికి కూడా పరీక్షలు చేయగా, ఆమెకూ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
 
ముఖ్యంగా, లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడటంతో ఇద్దరూ ఇంట్లోనే వుండేవారు. అయితే, నిత్యావసర వస్తువులు కొనేందుకు మాత్రమే యువకుడు బయటకు వెళ్లి వస్తున్నాడు. వారుంటున్న ఇంటికి సమీపంలోనే కూరగాయలు, పాలబూత్‌ ఉన్నాయి. 
 
రెండు రోజులకోసారి పాలు, కూరగాయలకు వెళ్లేవాడని పోలీసు విచారణలో తేలడం వల్ల కూరగాయల వ్యాపారిని, పాలబూత్‌ నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఓ రోజు ఏటీఎం కేంద్రంలో ఒక వ్యక్తికి డబ్బు డ్రా చేయడంలో సహాయం చేశానని ఆ యువకుడు చెప్పడం వల్ల ఆ వ్యక్తిని కూడా గుర్తించి వైద్యపరీక్షలు చేయించగా, నెగెటివ్‌ వచ్చింది. 
 
ఫలితంగా ఇద్దరికీ వైరస్‌ ఎలా సోకిందో ఆధారం లభించలేదు. మూలాన్ని గుర్తించేందుకు మధ్య మండలం పోలీసులు పరిశోధన చేస్తున్నారు. యువతీ యువకులు నివసించే ఇంటి యజమానులను, ఆమె వద్ద ట్యూషన్‌ చెప్పించుకునే పదేళ్ల బాలికను స్వీయ నిర్బంధంలో ఉంచారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు