అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తీసుకొంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలం నాటి పర్యావరణ మార్పులను చేస్తూ సంతకం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ట్రావెల్ బ్యాన్, హెచ్1బీ వీసా లాంటి వాటిపై తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
ఒబామా నాటి పర్యావరణ ప్రమాణాలను మార్పు చేయడం ద్వారా ఉత్పత్తి, నూతన ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్టేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఇంధన శక్తిపై ఉన్న పరిమితులను ఎత్తివేసే చారిత్రాత్మక చర్యగా ట్రంప్ తన నిర్ణయాన్ని పేర్కొన్నారు.