అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ మహిళ

ఆదివారం, 13 జనవరి 2019 (11:21 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీపడనుంది. హవాయి నుంచి అమెరికా ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ తరపున వరుసగా నాలుగోసారి ప్రాతినిథ్యం వహిస్తున్న 37 యేళ్ళ తులసీ గబ్బార్డ్ ఈ దఫా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 
 
2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలపడనున్నట్లు శనివారం ఆమె ప్రకటించారు. తద్వారా అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర లిఖించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాల్ని వెల్లడిస్తానని ఆమె వెల్లడించారు. 
 
డెమొక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు సెనెటర్ ఎలిజబెత్ వారెన్ ఇప్పటికే ప్రకటించారు. మరో 12 మంది అభ్యర్థులు సైతం పోరుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ కమలా హ్యారిస్ ఒకరు. ఇరాక్ యుద్ధం సమయంలో హవాయి ఆర్మీ నేషనల్ గార్డు నెలకొల్పిన మెడికల్ క్యాంప్‌లో ఏడాదిపాటు తులసీ గబ్బార్డ్ సేవలందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు