టర్కీలో ఓ దారుణం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం తన భార్యను సెల్ఫీ తీసుకుందాంమంటూ కొండ అంచుకు తీసుకెళ్లి, అక్కడ నుంచి కిందికి తోసేశాడు. కేవలం భార్యకు వచ్చే బీమా సొమ్ముకు ఆశపడి ఆ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టక్కీకి చెందిన వ్యక్తికి భార్య ఉంది. ఈమె గర్భందాల్చివుంది. అయితే, ఆమె మరణించాక వచ్చే బీమా సొమ్ము కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు.
ఇందులోభాగంగా, సెల్ఫీ తీసుకుందామని చెప్పిన ఆమెను కొండ అంచువరకూ తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఎదురుచూసీ, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆమెను కిందకు తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది.
అయితే.. హక్కాన్ అయాసల్ మాత్రం తాను నిర్దిషి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం సంతకాల కోసమే భార్యకు ఇన్సురెన్సు డాక్యుమెంట్లు ఇచ్చానని, తతిమా వ్యవహారమంతా ఇన్సూరెన్స్ సంస్థ ఏజెంటే చూసుకున్నాడని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది.