హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఆమెకు ఎలాంటి కష్టమొచ్చందో ఏమో తెలియదుగానీ, నవమాసాలు పెంచి కని పెంచిన కన్నబిడ్డలను చూస్తూ, సెల్ఫీ తీసుకుంటూ తనువుచాలించింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాలాపేటకు చెందిన మంజుల అనే మహిళకు 12 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్డులో బేకరీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు.