కరోనా కారణంగా అమెరికాలో తొలిసారి ఆగిన మరణదండన

సోమవారం, 13 జులై 2020 (10:43 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ కష్టపెడుతోంది. చివరకు మరణదండన అమలును కూడా నిలిపివేసింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. అమెరికాలో 17 యేళ్ళ తర్వాత నిర్ణయిచిన తేదీకి ఉరిశిక్ష అమలుకాకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 1996లో తుపాకుల వ్యాపారి విలియం ముల్లెర్, అతని భార్య నాన్సీ, 8 సంవత్సరాల కుమారుడు పొవెల్‌లను దారుణంగా చంపిన ఘటనలో ఓక్లహామాలోని యూకాన్ ప్రాంతానికి చెందిన డానియల్ లీ దోషిగా తేలడంతో కోర్టు అతనికి మరణదండన విధించింది.
 
ఆపై తాజాగా డానియల్ లీకి విషపు ఇంజక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూఎస్ చట్టాల ప్రకారం, విషపు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో దోషి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవాలి. 
 
ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండటంతో, శిక్ష అమలు జరిగే ప్రాంతానికి తాము రాలేమని ఫెడరల్ కోర్టుకు లీ బంధువులు స్పష్టం చేయగా, మరణ శిక్షను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరికొంతకాలం పాటు లీ జీవించే వీలు ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు