తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల డిగ్గి అనే ప్రాంతానికి చెందిన రాజీవ్ అలియాస్ రాజు (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అదే ప్రాంతానికి చెందిన షమీమ్ అనే మహిళ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, షమీమ్‌కు అదే ప్రాంతానికి చెందిన ట్రక్కు డ్రైవర్ రాజీవ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజీవ్ ఆమె కుమార్తెతో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు.
ఈ క్రమంలో షమీమ్ కుమార్తె స్థానికుడైన ముసాహిద్ అనే అబ్బాయి ప్రేమలో పడింది. ఈ విషయం షమీమ్, ప్రియుడు రాజీవ్ దృష్టికి వచ్చింది. పైగా, ఆ యువతి అలా మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడాన్ని రాజీవ్ జీర్ణించుకోలేక పోయాడు.
దీంతో కూతురి ప్రేమికుడు సాయంతో రాజీవ్‌ను షమీమ్ ఏప్రిల్ 22వ తేదీన గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఊరికి చివర్లో రాజీవ్ మృతదేహాన్ని పడేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులైన షమిమ్, ముసాహిద్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.