కాశ్మీర్‌లో అడుగుపెట్టొద్దు : బ్రిటన్ - జర్మనీ - ఆసీస్ పౌరులకు హెచ్చరిక

ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:02 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న అంతర్గత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా పౌరులకు ఆయా దేశాలు హెచ్చరిక  చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్‌కు వెళ్లొద్దని సూచన చేశాయి. ముఖ్యంగా, ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ఆ రాష్ట్ర సందర్శనకు వెళ్లొద్దని హెచ్చరించారు. 
 
కాశ్మీర్ లోయలో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులైన జైషే మొహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పవిత్ర అమర్నాథ్ యాత్రను కూడా కేంద్రం రద్దు చేసింది. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా పౌరులు సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశ అధికారులు తమ పౌరులకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారెవరూ రాష్ట్రం సందర్శనకు వెళ్లవద్దని హెచ్చరించారు. వేర్వేరు కారణాలతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో చిక్కుకున్న పౌరులు సదా అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
 
అక్కడి అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఆ మేరకు నడుచుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలో అదనపు బలగాల మోహరింపు, అమర్‌నాథ్‌ యాత్రీకులను తిరిగి వచ్చేయాలని ప్రభుత్వం కోరడం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు