గతనెలలో కరోనా వైరస్ లక్షణాలు సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లో ఆ వైరస్ వ్యాధి లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే, ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏడు రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారని, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వివరించారు.