విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచిన బ్రిటన్...

బుధవారం, 4 అక్టోబరు 2023 (12:26 IST)
బ్రిటన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులపై వీసా ఫీజుల భారం మోపింది. ఆకస్మికంగా విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచేసింది. విద్యార్థుల వీసా ధర రూ.50,428కి పెంచేసింది. అలాగే, విజిటింగ్ వీసా ధరను రూ.11,835కు పెంచినట్టు పేర్కొంది. గతంతో పోల్చితే ఈ ధరలు 15 శాతం నుంచి 20 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆరు నెలల లోపు విజిటింగ్ వీసా రుసుం గతంలో 100 పౌండ్లు ఉంటే ఇపుడు అది 115 పౌండ్లకు పెంచేసింది. విద్యార్థి వీసా రుసుం గతంలో 363 పౌండ్లు ఉంటే ఇపుడు అది 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 
భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు పీజు రూ.11,835, విద్యార్థి వీసా ధర రుసుం రూ.50,428కు పెంచింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. యూకే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలు 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ ధరల్లో 20 శాతం పెరుగుదల కనిపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు