టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఇటీవల బ్రిటన్‌లోని ఓ స్వతంత్ర కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదించాలని బ్రిటన్ ప్రధానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ సిబ్బంది సగటు వేతనాలు 5 నుంచి 7 శాతం మేర పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఖర్చులకు అప్పుల చేసి నిధులు సమీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యకు పూనుకోమని స్పష్టం చేశారు.