యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు-ఎట్టి పరిస్దితుల్లోనూ కీవ్ వైపు రావొద్దు

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:22 IST)
ఉక్రెయిన్‌లో చిక్కుతున్న భారతీయులు ఎట్టి పరిస్దితుల్లోనూ రాజధాని కీవ్ వైపు రావొద్దని ఇప్పటికే భారతీయ ఎంబసీ కోరింది. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల్నివెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం మల్లాగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ సాయంతో దౌత్యాధికారులను భారత్ రంగంలోకి దింపింది. 
 
ఉక్రెయిన్‌‌లో భారతీయులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలిపింది. దీంతో పాటు భూగర్భ బంకర్లు, మెట్రో స్టేషన్లలో దాక్కోవాలని కూడా సూచించింది.
 
అంతేగాకుండా  ఉక్రెయిన్ లో ప్రయాణాలు చేసే భారతీయులు తమ వాహనాలకు భారత మువ్వన్నెల జెండాను తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరింది. అలాగే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలని కూడా సూచించింది. 
 
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రస్తుతం హంగరీ, రొమేనియా మీదుగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రష్యా బలగాలకు భారతీయ జెండా ఉన్న వాహనాలకు ముప్పు తలపెట్టకుండా రష్యా ప్రభుత్వం నుంచి సూచనలు పంపినట్లు తెలుస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు