ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ముసాయిదా తీర్మానం.. భారత్‌, చైనా, యూఏఈలు దూరం

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:05 IST)
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రష్యా బలగాలు దాడులు నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.  
 
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని  రష్యా వీటో చేసింది. 
 
కౌన్సిల్ 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటును వేశాయి. భారత్‌, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 
 
అమెరికా..అల్బేనియాతో కలిసి ఈ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు