బ్రెజిల్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో అక్కడ 14వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,88,974కు చేరింది. ఇక గత 24 గంటల్లో బ్రెజిల్‌లో మృతులు కూడా భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 749 మంది మృతిచెందడంతో ఆ దేశంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,999కి చేరింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా బ్రెజిల్‌లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది.