అమెరికాలోని కాన్సాస్ రాజధాని క్లౌడ్ కౌంటి ప్రాంతంలో నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందిన జెలి సిల్సన్ (జైలీ చిల్సన్) అనే 14 ఏళ్ల బాలిక.. తనను తాను తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ బాలికపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు జైలీ చిల్సన్‌ను వెతికే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో జైలీ స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నట్లు తెలియవచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఆమెను ఇంటికి రావాల్సిందిగా పిలిచారు. పోలీసులు ఆమె పారిపోకుండా ఆమెను చుట్టుముట్టారు. అయితే ఉన్నట్టుండి తుపాకీతో ఆ బాలిక షూట్ చేసుకుంది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.