భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకమయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు.