నివాసంలోనే ఐసోలేషన్‌ : కమలా హారిస్‌కు కరోనా పాజిటివ్‌

బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:27 IST)
అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కమలా హారిస్‌కు మంగళవారం కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. 
 
ఈ మేరకు హారిస్ ప్రెస్ సెక్రటరీ కిర్‌స్టెన్ అలెన్ మాట్లాడుతూ.. వైస్ ప్రెసిడెంట్ ర్యాపిడ్, పిసిఆర్ పరీక్షలలో పాజిటివ్ పరీక్షించారని.. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని ప్రకటించారు. 
 
దీంతో హారిస్ తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కమలా హారిస్ ఇంట్లో నుంచే సేవలందిస్తారని.. నెగిటివ్ వచ్చిన తర్వాత వైట్ హౌస్‌కి తిరిగి వస్తారని వెల్లడించారు. సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. 
 
57 ఏళ్ల కమలా హారిస్.. కోవిడ్-19 వ్యాక్సిన్‌ సైతం తీసుకున్నారు. ఇటీవల బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు డోసుల టీకా తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు