ఓ వ్యక్తి తలను తీసి.. మరో వ్యక్తి దేహానికి అతికించనున్నారు... తొలి తలమార్పిడికి రంగం సిద్ధం!

శనివారం, 6 ఆగస్టు 2016 (10:17 IST)
ఇప్పటివరకు గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు వంటి అవయవాల మార్పిడి గురించే విన్నాం. ఇకపై తల మార్పిడి కూడా జరుగనుంది. నాడీ కండరాల క్షీణతతో బాధపడుతున్న వ్యక్తి తలను బ్రెయిన్ డెడ్ వ్యక్తి దేహానికి అమర్చే అరుదైన సర్జరీ త్వరలో జరుగనుంది. ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచ తొలి తల మార్పిడి ఆపరేషన్ ఇదే అవుతుంది. మొత్తం రూ.122 కోట్ల వ్యయంతో ఈ ఆపరేషన్‌ను వచ్చే 2017 డిసెంబర్ నెలలో చేపట్టనున్నారు. 
 
ఈ ఆపరేషన్ చేయించుకోబోయే వ్యక్తి పేరు వాలెరీ స్పిరిడోనోవ్. వయసు 31 యేళ్లు. వెర్డింగ్‌నింగ్-హాఫ్‌మన్ అనే అరుదైన నాడీ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వాలెరీ జీవితం కేవలం కుర్చీకే పరిమితమైంది. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి బారిన పడినవారు యుక్త వయస్సు వచ్చేవరకు జీవించడం చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో అరుదైన సర్జరీకి ముందుకొచ్చారు. 
 
ఈ ఆపరేషన్‌ను నా తలను కత్తితో తెగ నరుక్కొని మళ్లీ మరో ఆరోగ్యకరమైన దేహానికి అతికించుకొంటాను అని ప్రకటన చేసిన వివాదాస్పద వైద్యుడు సెర్జియో కానావెరో సహకారంతో ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకేన్‌స్టెయిన్ ఈ సర్జరీ నిర్వహించనున్నారు. వైద్య చరిత్రలోనే సంచలనానికి కారణమయ్యే ఈ చికిత్సను 2017 డిసెంబర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
దాదాపు 36 గంటలపాటు 150 మంది డాక్టర్లు, నర్సులు నిర్వహించే ఈ ఆపరేషన్ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్న థియేటర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్జరీలో భాగమయ్యే దేహాన్ని (బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి) వైద్యులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. సర్జరీ అనంతరం మెడకు, దేహానికి మధ్య ఉన్న గాయం మానేంత వరకు అంటే దాదాపు నాలుగువారాలపాటు పేషెంట్ కోమాలోనే ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి