ఈసారి కూడా అలా కొన్ని జెల్లీ ఫిష్‌లు కనిపించడంతో.. ఇజ్రాయెల్‌కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం డ్రోన్ కెమెరాతో చిత్రీకరించింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. ఈ జెల్లీ ఫిష్‌లకు సంబంధించిన వివరాలనూ వెల్లడించింది. భూమిమీద మొట్టమొదట పుట్టిన జీవ రాశుల్లో జెల్లీ ఫిష్‌లు కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెప్పారు.