పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదన్నాడు. అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పారు. చెప్పారు. అయితే అఫ్ఘనిస్థాన్‌ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు.
భారత దేశం, పాకిస్థాన్ లు తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని అన్నాడు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇస్లాంపై ఆధారపడిన బలమైన ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామన్నారు.